నెల్లూరు రూరల్‌లో కత్తులతో గంజాయి బ్యాచ్ వీరంగం

నెల్లూరు రూరల్‌లో కత్తులతో గంజాయి బ్యాచ్ వీరంగం

నెల్లూరు రూరల్ పరిధిలోని మార్కండేయ కాలనీలో గణతంత్ర వేడుకల వేళ ఆకతాయిలు రెచ్చిపోయారు. మోహన్, ఉమ అనే యువకులు స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం రాకీభాయ్ అనే వ్యక్తి మరో 15 మందితో వచ్చి, నడిరోడ్డుపై కత్తులతో హల్చల్ చేస్తూ "మా జోలికొస్తే చంపేస్తాం" అని స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీసులు విచారణ చేపట్టారు.