'రైతు వ్యతిరేక విధానాలపై 13న నిరసన'

BDK: అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించి, మీడియాతో CPI ML న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి నరేష్ మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 13న ప్రతి మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల అనుబంధం సంఘాల కార్యకర్తలతో నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరేష్ పిలుపునిచ్చారు.