రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి

ADB: నేరడిగొండలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.