సరైన నిద్ర లేకపోతే లావెక్కుతారు!

సరైన నిద్ర లేకపోతే లావెక్కుతారు!

కొందరు అధిక బరువు తగ్గాలని రోజూ వ్యాయామం చేస్తుంటారు. లావు తగ్గాలని డైట్ పాటిస్తుంటారు. కానీ ఏమాత్రం ఫలితం ఉండదు. అందుకు కారణం సరైన నిద్రలేకపోవడమేనని.. నిపుణులు అంటున్నారు. క్యాలరీలు తగ్గించి డైట్‌లో ఉన్నప్పుడు తగినంత నిద్రపోతేనే శరీరం ఎక్కువ కొవ్వును కరిగిస్తుందని చెబుతున్నారు. అంటే డైట్ ఒక్కటే కాదు, నిద్ర కూడా కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట.