రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: టెక్కలి సబ్ స్టేషన్- 1 పరిధిలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ నర్సింహకుమార్ తెలిపారు. రైల్వేస్టేషన్ రోడ్డు నుంచి తొలుసూరుపల్లి మార్గంలో రైల్వేలైన్ల మార్పిడి పనుల కారణంగా శ్రీనివాసనగర్, బాపారెడ్డికాలనీ, సాయిచంద్రన గర్, శ్యామసుందరకాలనీ, విద్యానగర్ ప్రాంతాలకు సరఫరా ఉండదన్నారు