యాక్సిడెంట్‌లో గాయాలు.. స్పందించిన మాజీ ఎమ్మెల్యే

యాక్సిడెంట్‌లో గాయాలు.. స్పందించిన మాజీ ఎమ్మెల్యే

VKB: గుంతలమయమై, కంకర తేలిన రోడ్డు కారణంగా ఓ వ్యక్తి బైక్‌పై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. మండలంలోని పగిడియాలకి చెందిన బాలరాజ్ బైక్‌పై నుంచి కిందపడి తలకు గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్పందించి క్షతగాత్రుడికి తాగు నీరందించారు. అనంతరం అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స కోసం తాండూర్ ఆసుపత్రికి తరలించారు.