ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.