రామతీర్థం గుట్టలో పచ్చదనం పెంపుకు టీటీడి చర్యలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట ఆలయం సమీపంలోని రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సుమారు 10 హెక్టార్లలో దశలవారీగా 3 వేల మొక్కలు నాటనున్నారు. రావి, మర్రి తదితర జాతుల మొక్కలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాటారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.