'శివాలయం నిర్మాణం కోసం భారీ విరాళం'

'శివాలయం నిర్మాణం కోసం భారీ విరాళం'

GDWL: గద్వాల జిల్లా నల్లకుంట శివాలయం నిర్మాణం కోసం గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి 75,000 రూపాయల చెక్కును ఆలయ కమిటీ సభ్యులు అందజేసినట్లు పులిపాటి వెంకటేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి కోసం ఇది నా వంతు కృషి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గోపాల్‌, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.