నేడు విద్యుత్ అదాలత్

NLR: పొదలకూరు డిస్కం సబ్ డివిజన్ పరిధిలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఏడీఈ సుబ్రమణ్యం తెలిపారు. ఏడీఈ మాట్లాడుతూ.. పొదలకూరు, మనుబోలు, సైదాపురం, ముత్తుకూరు, వెంకటాచలం, జిల్లా గ్రామీణ మండలాలకు చెందిన విద్యుత్ సమస్యల పరిష్కారం పై సమావేశం నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.