వెనెజువెలా నౌకపై అమెరికా దాడి.. మళ్లీ ఉద్రిక్తతలు

వెనెజువెలా నౌకపై అమెరికా దాడి.. మళ్లీ ఉద్రిక్తతలు

వెనెజువెలా నౌకపై అమెరికా దాడి చేసింది. అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉన్నాయని, అందుకే దాన్ని లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రెండు వారాల క్రితం వెనెజువెలా నుంచి వచ్చిన ఓ స్పీడ్ బోట్‌పై అమెరికా మిలిటరీ జరిపిన దాడిలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.