కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన 11వ డివిజన్ కార్పొరేటర్

కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన 11వ డివిజన్ కార్పొరేటర్

NLG: నల్గొండ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 11వ డివిజన్ నుంచి గెలుపొందిన పాలకూరి సుమలత సంతోష్ ఇవాళ మంత్రి వెంకట్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని పచ్చల సోమేశ్వరాలయానికి వచ్చిన మంత్రిని రైస్ మిల్ అసోసియేషన్ నేత ఇంద్రారెడ్డితో కలిసి ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.