సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం

సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం

విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్‌ను నియమించినట్లు జిల్లా గనులు, భూగర్భశాఖాధికారి సూర్య చంద్రరావు ఆదివారం తెలిపారు. నేటి నుంచి జూన్ 16 వరకు ఇసుక, రాయి, మట్టి, గ్రానైట్ వంటి ఖనిజాలు తీసుకునే వారి నుంచి ఈ సంస్థ నిర్ణీత సీనరేజ్ ఛార్జీలను వసూలు చేయనుంది. లీజుదారులు ప్రజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహకరించాలని ఆయన కోరారు.