20 సార్లకు పైగా రక్తదానం చేసిన పోలీస్
ఖమ్మం పోలీస్ శాఖలో రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా భాద్యతలు నిర్వహిస్తున్న సతీష్ ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేశారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని నిస్వార్థ సేవకుడు సతీష్ ప్రసాదిస్తున్నారు. ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా, నిశబ్దంగా తమ బాధ్యతను నెరవేర్చిన ఈ నిస్వార్థ సేవ గొప్ప మానవత్వానికి నిదర్శనం.