ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేత

MBNR: హైద్రాబాద్ రవీంద్రభారతిలో సకలజనుల సేవా సమితి (SSS) వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ మణిమంజరి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పలు అధికారులు పాల్గొన్నారు.