శ్రీ నూకాలమ్మ దేవాలయంలో మొదలైన దర్శనాలు

శ్రీ నూకాలమ్మ దేవాలయంలో మొదలైన దర్శనాలు

AKP: నర్సీపట్నం అబిడ్స్ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు దర్శనాలు మొదలయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేకువ జాము నుండి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులు దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.