ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

VZM: ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఈవీఎం భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రతినెల నిర్వహించే తనిఖీలలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి నెల్లిమర్లలో ఉన్న ఈవీఎం గోదాంను పరిశీలించారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అగ్నిమాపక పరికరాల సిద్ధత, 24 గంటల భద్రతా సిబ్బంది విధులు కలెక్టర్ పరిశీలించారు.