అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తుల ఆహ్వనం: MAO

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకానికి రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొవడలూరు MAO లక్ష్మీ తెలిపారు. ఒక రైతు కుటుంబానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.14,000, రూ.6,000ల చొప్పున రూ.20వేలను సాగు ఖర్చుల కోసం ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు తమ ఆధార్ జిరాక్స్, 1-బీ వివరాలను తమ పరిధిలోని సచివాలయంలో వ్యవసాయ సహాయకులకు అందజేయాలన్నారు.