చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ ప్రాంతం కూడలి నందు శుక్రవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నదని, నిత్యం పరిసర గ్రామాల నుంచి పట్టణానికి వివిధ పనుల కోసం ప్రజల వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడతాయని అన్నారు.