ధర్మవరంలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన రద్దు

ధర్మవరంలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన రద్దు

సత్యసాయి: ధర్మవరం పర్యటనకు రావలసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ నేటి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు మంత్రి కార్యాలయం ఇంఛార్జ్ హరీష్ బాబు తెలిపారు. మంగళవారం రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సు సహా ఇతర ముఖ్య అధికారులతో జరిగే సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండటంతో మంత్రి ధర్మవరం పర్యటనకు వెళ్లడం సాధ్యపడలేదని ఆయన స్పష్టంచేశారు.