VIDEO: అంత్యక్రియలకు 'పీకల్లోతు' కష్టాలు
VZM: దత్తిరాజేరు మండలం పెదకాదకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నాగిరెడ్డి వెంకట్(30) గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. పెదకాద గ్రామంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులు తీవ్రఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని దహనం చేసేందుకు పీకల వరకు నీటిలోదిగి స్మశానానికికు తీసుకువెళ్లారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.