స్వదేశానికి 52 వేల మంది భారతీయులు

స్వదేశానికి 52 వేల మంది భారతీయులు

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌లు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి 52,000 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. పశ్చిమాసియాలో పాక్షికంగా విమానాల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతో వారు భారత్‌కు చేరుకున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది. పశ్చిమాసియాలో చిక్కుకున్న పౌరులు స్థానిక అధికారుల మార్గదర్శకాలను, అడ్వైజరీలను పాటించాలని సూచించింది.