అంగన్వాడీ కేంద్రంలో 'పోషణ పక్వాడ' కార్యక్రమం
W.G: పోషణ పక్వాడలో భాగంగా పెంటపాడు మండలం పరిమెళ్ళ అంగన్వాడీ కేంద్రంలో ICDS సూపర్‌వైజర్ సుజాత ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటపాటలతో పాటు ఇంట్లో వాడిన పదార్థాలతో విద్యా బొమ్మలు తయారు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. బొమ్మల ద్వారా చిన్నారులకు సులభతర విద్యను అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.