ఎరువులు కోసం బారులు తీరిన రైతులు

SKLM: ఖరీఫ్ సీజన్‌లో సాగు కోసం రైతులు ఎరువుల కోసం పాట్లుపడుతున్నారు. యూరియా కొరతతో ఎరువు దొరుకుతుందో లేదో భయంతో మంగళవారం లక్ష్మీనర్సుపేట జంక్షన్‌లో ప్రయివేటు డీలర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. ప్రయివేటు డీలర్‌కు 660 బస్తాల యూరియా ఎరువు వచ్చిందని రైతులందరికీ సరఫరా చేయడం జరుగుతుందని, ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయాధికారి సింహాచలం తెలిపారు.