'తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

కడప: అట్లూరు మండలంలో దిత్వా తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అట్లూరు మండలం కొండూరు గ్రామంలో దిత్వా తుఫాన్ వల్ల చేతికొచ్చిన వరి పంట నీట మునిగింది. పంట పూర్తిగా దెబ్బతిని మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి రామకృష్ణయ్య నీట మునిగిన వరి పంటను పరిశీలించారు.