అక్రమ కట్టడాల తొలగింపును పరిశీలించిన ఎంపీడీవో

అక్రమ కట్టడాల తొలగింపును పరిశీలించిన ఎంపీడీవో

కోనసీమ: రావులపాలెంలో రహదారి వెంబడి ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పట్టణంలో రోడ్ల వెంట అక్రమంగా నిర్మించిన కట్టడాలు రహదారి విస్తరణకు అడ్డంకిగా మారాయి. మంగళవారం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం స్వయంగా తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. రహదారి వెంబడి అక్రమ నిర్మాణాలు తొలగించడం వల్ల వాహన రాకపోకలు సులభతరమవుతాయన్నారు.