కార్తీక దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే

కార్తీక దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే

ATP: కార్తీక సోమవారం సందర్భంగా నసనకోట గ్రామంలోని పురాతన శివాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో దీపాలు వెలిగించి శివుడికి మొక్కులు చెల్లించారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఈ పూజలు చేసినట్లు ఎమ్మెల్యే సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.