రమణక్కపేటలో నూజివీడు సబ్ కలెక్టర్

కృష్ణా: నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ శుక్రవారం ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలోని కుమ్మరపేట ఏరియాలో వరద ముంపు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలో 50 ఇల్లు వరకు నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఏరియాని కొందరు వ్యక్తులు అడ్డుకట్ట వేసి వరద నీటిని అడ్డుకుంటున్నారు. అయితే కొంత భూమిని వరద ముంపు డ్రైనేజీ పారేందుకు అధికారులు సర్వే చేశారు.