పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

KMM: ఖమ్మంలో పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం భూదాన్ బాధితులకు భోజనంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. హెల్త్ చెకప్ క్యాంప్ ద్వారా అవసరమైన మందులు అందజేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా బాధితులకు భోజనం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.