వరంగల్‌లో నిలిచిపోయిన ఐటీ అభివృద్ధి
WGL: జిల్లాలో ఐటీ రంగానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల చొరవ లేకపోవడంతో IT అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు మంత్రులు, MLAలు, MPలు ఉన్నప్పటికీ కొత్త IT పరిశ్రమలపై సమీక్షలు జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది సుమారు 20 వేల మంది ఇంజినీర్లు పట్టాలు పొంది ఉపాధి కోసం వలస వెళ్తున్నారు.