నేటి నుంచి ఒంటిపూట బడులు
ప్రకాశం: ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి కొండపి మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటుపాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఎంఈఓ రామారావు తెలిపారు. వేసవి దృష్ట్యా ఈ నెల16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించామన్నారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.