VIDEO: రేపే కందికొండ జాతర.. ఏర్పాట్లు పూర్తి

VIDEO: రేపే కందికొండ జాతర.. ఏర్పాట్లు పూర్తి

MHBD: కురవి మండలం కందికొండలో ఉన్న కందగిరి గుట్ట వద్ద కార్తీకపౌర్ణమి వేళ బుధవారం కందికొండ జాతర ఘనంగా జరుగనుందని నిర్వాహకులు తెలిపారు. కందగిరి శిఖరాగ్రంపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామిని, గుట్ట పైకి ఎక్కుతున్న క్రమంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉమ్మడి WGL, NLG, KMM నుండి భక్తులు తరలివస్తారన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్పారు.