విద్యార్థులకు అస్వస్థత.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.!
GDWL: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ సంతోష్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్ జయరాములును తక్షణమే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం,నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.