చెడిపోయిన చేతి పంప్.. పట్టించుకోని అధికారులు

ASF: కాగజ్‌నగర్ మండలం కోయవాగు గ్రామంలో చేతి పంప్ గత 4 నెలలుగా చెడిపోయి ఉన్నా అధికారులు పట్టించుకొవడం లేదని ప్రజలు మంగళవారం ప్రకటనలో తెలిపారు. మిషన్ భగీరథ లైన్ ఉన్నా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. పంచాయతీ సెక్రటరీకి సమస్య తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి హ్యాండ్ పంప్ బాగుచేయాలని ప్రజలు కొరుతున్నారు.