రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభం

రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభం

ASR: అరకులోయలో శ్మశాన వాటిక రక్షణ గోడ నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్, భీమరాజు తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, పనులు ప్రారంభించారు. రక్షణ గోడ నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.15లక్షల నిధులు మంజూరయ్యాయని ప్రజాప్రతినిధులు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.