శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి గరుడ వాహనం అందజేత
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఇదే గ్రామానికి ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు భరతేశ్వరరావు గరుడ వాహనాన్ని అందజేశారు. రూ.50వేల విలువచేసే గరుడ వాహనాన్ని ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి సందర్భంగా ఆలయం చుట్టూ భక్తుల సమక్షంలో ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.