'ప్రజలు ఆలోచించి ఓటు వేయండి'
NLG: రేపు జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను గెలిపించుకోవాలని TG మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి ఇంద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. అందుబాటులో ఉండే వారిని ఆదరించి గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లను ఆయన కోరారు.