అమర జీవికి ఘనంగా నివాళులు
VZM: కలెక్టరేట్‌లో స్వర్గీయ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా ఇవాళ జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.