VIDEO: డీజేలకు అనుమతి లేదు: ఎస్సై

NGKL: పట్టణ పరిధిలోని వినాయక చవితి ఉత్సవాలలో డీజేలకు అనుమతి లేదని ఎస్సై కె.గోవర్ధన్ ఈరోజు తెలిపారు. డీజేల వల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుందని, వాటికి బదులుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. చెక్కభజన, షేర్ బ్యాండ్, కోలాటం వంటి ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఉత్సవ కమిటీలను కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.