'చలిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'చలిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VKB: తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుల్కచర్ల వైద్యుడు కిరణ్ కుమార్ గౌడ్ సూచించారు. శీతాకాలంలో అంటువ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కూలీలు, రైతులు వింత రోగాలతో ఆసుపత్రికి వస్తున్నారని, రోగాలకు గురైన ప్రజల రక్త నమూనాలను పరీక్షలు చేస్తామని తెలిపారు. అస్వస్థతకు గురైన వారు వెంటనే ఆసుపత్రికి రావాలని ఆయన కోరారు.