శతాధిక వృద్ధురాలు మృతి

శతాధిక వృద్ధురాలు మృతి

KNR: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బొజ్జ జోగవ్వ (101) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈమెకు ఒక కొడుకు, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. జోగవ్వ తన పనులను తానే చేసుకునేదని, ఇతరులపై ఆధారపడేది కాదన్నారు. జోగవ్వ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా కుటుంబ సభ్యులను పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పరామర్శించారు.