పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణం BMS క్లబ్ ఆవరణంలో ఆదివారం లయన్స్ క్లబ్ వారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ రకాల కంటి జబ్బులతో శిబిరానికి వచ్చిన రోగులకు డాక్టర్ నివేదిత కంటి పరీక్షలు నిర్వహించి 26 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శివ, ముత్యాలు, బాలసుబ్రమణ్యం, కేశవరెడ్డి, సుధాకర్ రావు, త్రిమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.