గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్
BDK: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఇవాళ భద్రాద్రి జిల్లా కేంద్రంలో గ్రంథాలయంలో ప్రారంభించబడ్డాయి. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. నెహ్రూ, ఎస్‌ఆర్ రంగనాథన్‌ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని చిన్నారులతో పాటలు పాడించారు.