కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన

కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులు కలెక్టరేట్ వద్దకు భారీగా తరలివచ్చారు. వడగండ్ల వాన కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన రైతులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు.