ఆ ఐడియా ఇచ్చింది స్మృతి మంధాన: మంత్రి లోకేష్

ఆ ఐడియా ఇచ్చింది స్మృతి మంధాన: మంత్రి లోకేష్

క్రికెటర్ స్మృతి మంధాన పంచుకున్న ఆలోచనను ఇటీవల అమలు చేసినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆగస్టులో ఓ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు, మహిళా క్రికెటర్ల పేరు మీద స్టేడియం స్టాండ్‌లకు పేరు పెట్టే ఆలోచనను స్మృతి మంధాన పంచుకున్నారని తెలిపారు. ఆ సూచన మేరకు గత నెలలో వైజాగ్ స్టేడియంలోని ఓ స్టాండ్‌ను మిథాలీ రాజ్‌కు అంకితం చేసి ఆ ఆలోచనను ఆచరణలో పెట్టామని పేర్కొన్నారు.