నాని జెట్ స్పీడ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్!
టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో 'ది ప్యారడైజ్' చేస్తున్న నాని.. సుజీత్‌తోనూ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అయ్యేలా ఉంది. '96' డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చెప్పిన లైన్ నానికి బాగా నచ్చేసిందట. వెంటనే ఓకే చెప్పేశాడని టాక్. ఈ క్లాస్ దర్శకుడితో నాని మూవీ అంటే ఫ్యాన్స్‌కు పండగే.