మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: MLA
MNCL: బెల్లంపల్లి మండలంలోని 30 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన రూ.5 కోట్ల ఋణాల చెక్కుని MLA వినోద్ సోమవారం పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. అన్ని రంగాలలో మహిళలు భాగస్వాములు కావాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు.