సీతంపేటలో పల్లెనిద్ర కార్యక్రమం
VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాలతో ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని సీతంపేటలో సీఐ నారాయణమూర్తి మంగళవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గ్రామస్తులకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు. శిరస్త్రాణం విధిగా ధరించాలని సూచించారు. గ్రామాల్లో గంజాయి సరఫరా రవాణా చేస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.