VIDEO: కోమరోలులో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

VIDEO: కోమరోలులో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

ప్రకాశం: కొమరోలు మండలం తాటిచెర్ల పంచాయతీ హసనాపురం గ్రామంలో సోమవారం 'రైతన్న మీకోసం' వారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.