పిఠాపురం జనసేన ఇంఛార్జ్‌గా దొరబాబు..?
కాకినాడ: పిఠాపురం జనసేన ఇంఛార్జ్‌గా ఇప్పటి వరకు మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనను ఇటీవల ఆ పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఆ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, నియోజవర్గంపై పట్టు ఉండడంతో దొరబాబుకు ఆ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.